స్లీపర్ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

స్లీపర్ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, వెలుగు: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మణుగూరు డిపోకు కేటాయించిన రెండు స్లీపర్ కం సిట్టింగ్ బస్సులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం ప్రారంభించారు.

మణుగూరులోని సురక్ష బస్టాండ్ లో ఈ రెండు లహరి స్లీపర్ క్లాస్ బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన ఆయన రోజూ రాత్రి 8.50 గంటలకు మణుగూరు నుంచి హైదరాబాద్ కు ఈ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ టి.స్వామితోపాటు పలువురు ఆర్టీసీ సిబ్బంది, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.