అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్రు : రఘునందన్

అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్రు : రఘునందన్

అధికారంలో ఉన్నామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సభలో కేటీఆర్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నరేండ్లు అయితున్నా ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని రఘునందన్ ఆరోపించారు. తనను గెలిపించారన్న అక్కసుతో కేసీఆర్ దుబ్బాకకు డిగ్రీ ఇవ్వలేదని, రింగ్ రోడ్డు కూడా మంజూరు చేయలేని వాపోయారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని రఘునందన్ హామీ ఇచ్చారు. 

అసెంబ్లీలో గంటలు గంటలు మాట్లాడుతున్న కేటీఆర్.. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమకు 2 నిమిషాల సమయం కూడా ఇవ్వడం లేదని రఘునందన్ వాపోయారు. బీజేపీకి కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారంటూ కేటీఆర్ కించపరిచేలా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. బీజేపీకి కూడా టైం వస్తదని, అప్పుడు కేటీఆర్ కూర్చేనే ప్లేస్లో తాము ఉంటామని అన్నారు. అప్పుడు తాము వారిలా కాకుండా అందరికీ మాట్లాడే అవకాశమిస్తామని రఘునందన్ చెప్పారు.