ప్రజాస్వామ్య స్పూర్తిని కేటీఆర్ అర్ధం చేసుకోవాలి

ప్రజాస్వామ్య స్పూర్తిని కేటీఆర్ అర్ధం చేసుకోవాలి

ప్రధాని గురించి ఇక్కడ మాట్లాడినట్లు చైనాలో మాట్లాడితే ఊరుకోరని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. చైనాను మంత్రి కేటీఆర్ పొగుడుతున్నారని అక్కడ ఉన్నది మిలటరీ రూల్ అని తెలుసుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ గొప్పలు చెబుతున్న చైనాలో ముస్లింలను ఊచకోత కోస్తున్నారని అక్కడి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే చంపేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చైనా వెళ్లి మాట్లాడితే అప్పుడు తెలుస్తుందంటూ చురకలంటించారు.

కరోనాతో చనిపోయిన వారి లెక్కలు కూడా చైనా చెప్పదని చైనా ప్రభుత్వం చెప్పిందే రాసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్య స్పూర్తిని కేటీఆర్ అర్ధం చేసుకుని మాట్లాడాలని సూచించారు. చైనాలో ఉన్న మిలటరీ రూల్ ని ఇక్కడ కోరుకుంటున్నారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. టీఆర్ఎస్ శ్రేణులు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ ఇలా మాట్లాడితే హరీష్ రావు ఇంకోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2లక్షల 50వేల బడ్జెట్ గల రాష్ట్రానికి కేంద్రం నుంచి 5వేల కోట్లు రాకపోతే ఏంటని ప్రశ్నించారు. 

కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిందన్న రఘుందన్ రావు అది హరీష్ రావు తెలుసుకోవాలని సూచించారు. అభివృద్ధి మాట్లాడకుండా కేంద్రంపై అనవసర విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. త్వరలోనే ప్రజలు అనుకున్నది జరుగుతుందని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

ఇక దాదా నయా జర్నీ

దేశభక్తుడన్న కేజ్రీవాల్..16కోట్లు నొక్కేశారన్న స్మృతి ఇరానీ