టీకా ధరలపై కేటీఆర్ ట్వీట్ బాధ్యతారాహిత్యం

టీకా ధరలపై కేటీఆర్ ట్వీట్ బాధ్యతారాహిత్యం

కరోనా విషయంలో మంత్రులు మాట్లాడుతున్న తీరు తీవ్ర అభ్యంతకరంగా ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రజలకు మనో ధైర్యం ఇవ్వాల్సింది పోయి..రాజకీయాలు చేయడం దారుణం అన్నారు. ప్రభుత్వ తీరుపై పత్రికా ప్రకటన చేసిన రాజాసింగ్..కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసినట్టు కన్పిస్తోందన్నారు. ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కేంద్రంపై మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వ్యాక్సిన్ ధరల విషయంలో కేటీఆర్ ట్వీట్ బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు పత్రికా ప్రకటనలో. కేంద్రం గైడ్ లైన్స్ రాక ముందే విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. 45 ఏళ్లపై బడిన వారందరికీ కేంద్రం కరోనా టీకా ఫ్రీగా ఇస్తోందన్నారు.
 
కరోనా నియంత్రణ కోసం CMRFకి వచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో  రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. రెమ్ డిసివిర్ విషయం లో నిన్న మంత్రి కేటీఆర్  మాట్లాడింది నిజమా..ఇవాళ మంత్రి ఆటల రాజేందర్  మాట్లాడింది నిజమా స్పష్టం చేయాలన్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.