నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకోవాలి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకోవాలి :  ఎమ్మెల్యే రాందాస్ నాయక్
  •  వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 

కారేపల్లి, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సూచించారు. కారేపల్లి లోని వెంకటేశ్వర నగర్, సంత వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం మొక్కలు నాటారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనాన్ని పెంపొందించా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్, ఎస్సై గోపి, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.