పల్లెల్లో మెరుగైన వైద్యం కోసమే పల్లె దవాఖానలు : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి

పల్లెల్లో  మెరుగైన వైద్యం కోసమే పల్లె దవాఖానలు :  ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి

శాయంపేట (దామెర), వెలుగు: పల్లెల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకే పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో రూ.20 లక్షలతో నిర్మించిన ఆయుష్మాన్​ ఆరోగ్య ఉపకేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకుముందు వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్​ విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. పల్లె దవాఖానల్లో అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.