మంత్రి వివేక్ ని కలిసిన ఎమ్మెల్యే సంజయ్

మంత్రి వివేక్ ని కలిసిన ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల రూరల్ వెలుగు: ఇటీవల మంత్రి పదవులు చేపట్టిన కార్మిక ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌‌‌‌‌‌‌‌లను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కలిశారు. ఈ సందర్భంగా సచివాలయం లోని చాంబర్లలో మంత్రులను కలిసి పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి జువ్వాడ నర్సింగరావు, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ జ్యోతి, గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.