కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ వస్తేనే సంక్షేమం, అభివృద్ధి : సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ వస్తేనే సంక్షేమం, అభివృద్ధి : సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌

జగిత్యాల టౌన్, రాయికల్, వెలుగు: పదేండ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాలను సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి చేశారని, మరోసారి బీఆర్ఎస్​సర్కారు వస్తేనే సంక్షేమ పథకాలు, అభివృద్ది ఫలాలు ప్రజలకు అందుతాయని ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ అన్నారు. సారంగాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం పోతారం, బట్టపెల్లి, సారంగాపూర్‌‌‌‌‌‌‌‌, మ్యాడారంతండా, భీంరెడ్డిగూడెం, రేచపెల్లి, లచ్చానాయక్‌‌‌‌‌‌‌‌తండాల్లో మంగళవారం మాజీ మంత్రి రాజేశంగౌడ్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

అనంతరం రాయికల్ మండలం జగన్నాథ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దీపావళి సందర్భంగా నిర్వహించే దండారీ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొని ఆదివాసీ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సర్కారు పేదలకు ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారని, కుల సంఘ భవనాల నుంచి సర్కారు బడి, ఆలయాల వరకు, పుట్టిన పిల్లల నుంచి ఆడబిడ్డల వివాహాల వరకు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామన్నారు. మరోసారి అవకాశం ఇస్తే అర్హులైన ప్రతి ఒక్కరికీ దళితబంధు, బీసీ బంధును అందిస్తామన్నారు.