
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు మహిళలంటే చిన్న చూపు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. సోమవారం తెలంగాణ మహిళా కమిషన్ కోసం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీతక్క పాల్గొని మాట్లాడారు. మహిళల సమస్యల కోసం ఒక జేఏసీ ఏర్పాటు కావాలన్నారు. అన్ని పార్టీల మహిళా విభాగాల ఆధ్వర్యంలో గవర్నర్ ను కలుస్తామని.. మహిళలను తొక్కేయడంలో సీఎం కేసీఆర్ కు ఎవరూ సాటి రారన్నారు.
తెలంగాణ మహిళా కమిషన్ కోసం బలమైన ఉద్యమం చేయాలని.. బతుకమ్మ పేరు కవితమ్మకు మాత్రమే రావాలని కేసీఆర్ పరితపించారని.. మహిళల జీవితాలను కేసీఆర్ బాగు చేస్తారన్న నమ్మకం లేదన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ తప్పులు మరుగున పడిపోతున్నాయని తెలిపారు ఎమ్మెల్యే సీతక్క.