
ములుగు జిల్లా అభివృద్ధి కోసం తాను, జగదీష్ అన్న, చెల్లెలు లాగా రాజకీయాలకతీతంగా కలిసి పని చేశామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. వరంగల్ జిల్లా ములుగు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ మృతి పట్ల ఆమె సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ క్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జగదీష్ మృతి ములుగు జిల్లాకు తీరని లోటు మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా అభివృద్ధికి ఆయన కృషి ఎనలేనిది అని కొనియాడారు. రాజకీయంగా దూషణలు, విమర్శలకు దిగలేని నాయకుడని పేర్కొన్నారు. జగదీష్ మానిసిక ఒత్తిడికి లోనయ్యాడని చెప్పారు. ఆయన గుర్తుగా సంతాప దినాలు ప్రకటిస్తామని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే నరేందర్ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.