సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని సీతక్క పిటిషన్

సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని సీతక్క పిటిషన్

నియోజకవర్గాల అభివృద్ధి నిధుల మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ వేశారు. ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని సీతక్క పిటిషన్‌లో వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నందున తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని తెలిపారు. 

సీడీఎఫ్ మంజూరులో జిల్లా మంత్రి ప్రమేయం చట్ట విరుద్ధమని ఆమె అన్నారు. జిల్లా మంత్రి ఆమోదంతో నిధులు మంజూరు చేయాలన్న జీవో 12 కొట్టేయాలని సీతక్క చెప్పారు.

వెంటనే నిధులు విడుదలకు ఆదేశించాలని న్యాయవాది కృష్ణ కుమార్ గౌడ్ కోరారు. ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను అక్టోబరు 9కి వాయిదా వేసింది.