ఖానాపూర్​ బీఆర్​ఎస్​లో టికెట్​ కోసం కొట్లాట

ఖానాపూర్​ బీఆర్​ఎస్​లో టికెట్​ కోసం కొట్లాట

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్​ఎస్​ టికెట్ లొల్లి కొనసాగుతోంది. టికెట్​తనకే అని, టికెట్​ ఆశిస్తున్న జాన్సన్​ నాయక్​ వేరే దారి చూసుకుంటాడని ఎమ్మెల్యే రేఖ అనగా.. ఆ కామెంట్లను జాన్సన్​ ఖండించాడు.   పట్టణంలోని ఈద్గా వద్ద శనివారం  రంజాన్ వేడుకలకు  ఎమ్మెల్యే రేఖ, జాన్సన్​ నాయక్​ హాజరయ్యారు.  ఈ సందర్భంగా  ఇరువురూ పలకరించుకున్నారు. అనంతరం   రేఖానాయక్  మీడియాతో మాట్లాడారు.  రానున్న ఎన్నికల్లో జాన్సన్ నాయక్​ తన గెలుపు కోసం కృషి చేస్తారని ,  అధిష్టానం తనకే టికెట్ డిసైడ్ చేసిందంటూ ఎమ్మెల్యే వెల్లడించారు.  అయితే ఎమ్మెల్యే రేఖా  వ్యాఖ్యలను జాన్సన్ నాయక్ ఖండించారు. టీఆర్ఎస్ లో సెల్ఫ్ డిక్లరేషన్ లేదని చెప్పారు. తాను కూడా ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీలో ఉన్నట్టు జాన్సన్ నాయక్ ప్రకటించాడు.  ఈ  చర్చనీయాంశంగా మారింది.