ప్రభుత్వ పాఠశాలలను బలోపేతమే లక్ష్యం : ఎమ్మెల్యే వేముల వీరేశం

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతమే లక్ష్యం : ఎమ్మెల్యే వేముల వీరేశం
  • ఎమ్మెల్యే వేముల వీరేశం 

నకిరేకల్, కేతేపల్లి (నకిరేకల్), వెలుగు : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నకిరేకల్ లోని క్యాంపు కార్యాలయంలో నకిరేకల్, కట్టంగూర్, నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి, చిట్యాల మండలాలకు చెందిన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించాల్సిన మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు.

 అనంతరం కేతేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టీఎల్ఎం (ఎఫ్ఎల్ఎన్) మేళాలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ రజితాశ్రీనివాస్, పీఏసీఎస్​చైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.