ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ కుటుంబానికి మేలు : ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ కుటుంబానికి మేలు : ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

సుల్తానాబాద్, వెలుగు: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లిలో మంగళవారం సీసీ రోడ్లు, మహిళా సంఘ భవనంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నర్సయ్యపల్లి, గాంధీనగర్, బొంతకుంటపల్లి, దుబ్బపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు.

అనంతరం పలు ఇండ్లకు ముగ్గు పోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల కళ్లలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి సంక్షేమ  పథకాలను ముందుకు తీసుకువెళ్లే వీలుంటుందన్నారు. జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, సింగిల్ విండో చైర్మన్ సందీప్ రావు, తిరుమలరావు, దామోదర్ రావు, మహేందర్, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అబ్బయ్య గౌడ్,  పాల్గొన్నారు.