శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ దంపతులు

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ దంపతులు

మంచిర్యాల:  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సరోజా దంపతులు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ లోని అమ్మ గార్డెన్, మందమర్రిలోని పులిమడుగు, యాపల్ ఏరియాలోని రామాలయం, శివాలయం, పంచముఖ హనుమాన్ ఆలయంలో సీతారాముల వారిని దర్శించుకునీ మొక్కులు చెల్లించుకున్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు.  ఈ సందర్భంగా వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు  శాలువాతో సత్కరించారు.  శ్రీరామనవమి పురస్కరించుకుని ఎమ్మెల్యే వివేక్ దంపతులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

చెన్నూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని సాయంత్రం చెన్నూరు పట్టణంలో రాముడి శోభాయాత్రలో పాల్గొననున్నారు ఎమ్మెల్యే వివేక్ దంపతులు, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, కుమారుడు గడ్డం వంశీకృష్ణ.