బోనాల్లో మొక్కులు.. ముస్లింలతో ఇఫ్తార్

బోనాల్లో మొక్కులు.. ముస్లింలతో ఇఫ్తార్
  •     వేడుకల్లో పాల్గొన్న చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్​ వెంకటస్వామి, వినోద్​

నెట్​వర్క్,​ వెలుగు: చెన్నూరు మండలం లింగంపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన మధున పోచమ్మ బోనాల జాతరకు  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో కలిసి పోచమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నియోజకవర్గ ప్రజలంతా బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు.

చెన్నూరు ప్రెస్​క్లబ్ అధ్యక్షుడు అట్టెం మధునయ్య, వైస్ ప్రెసిడెంట్ ​కల్యాణ్ నేతృత్వంలో పాత్రికేయులు ఎమ్మెల్యేను కలిశారు. పట్టణంలోని అస్నాద్ రోడ్డులో ఉన్న సర్వే నంబర్​863లో 2.5 గుంటల భూమిని అప్పటి ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిందని, ఆ భూమిని ఇతరులు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ స్థలాన్ని తిరిగి తమకు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ మాజీ వైస్​ చైర్మన్​ మూల రాజిరెడ్డి, కాంగ్రెస్ ​లీడర్లు ఐత హేమంతరెడ్డి, గొడిశల బాపిరెడ్డి, మాజీ సర్పంచ్ రమేశ్, పొడేటి రవి,పెద్దింటి శ్రీనివాస్, బాపగౌడ్, మహేశ్ తివారీ, అన్వర్, రాజమల్ల గౌడ్, అంకాగౌడ్ పాల్గొన్నారు. 

ఇఫ్తార్​విందులో ఎమ్మెల్యేలు

బెల్లంపల్లి పట్టణం ప్రగతి జూనియర్​ కాలేజ్​ ఆవరణలో సోమవారం రాత్రి కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్​విందులో ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ ​వెంకటస్వామి చీఫ్ ​గెస్ట్​లుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఖర్జూర పండ్లు తినిపించారు. ​ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ పెద్దపీట వేస్తోందన్నారు.

ముస్లిం కుటుంబాలు రంజాన్​ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్​మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, ఎన్ఎస్​యూఐ జిల్లా ప్రెసిడెంట్​ఆదర్శ్​వర్ధన్, కాంగ్రెస్​టౌన్​ ప్రెసిడెంట్​ ముచ్చర్ల మల్లయ్య, మైనార్టీ లీడర్లు అన్వర్​ఖాన్, నిజాముద్ధీన్, మునిమంద రమేశ్, చిలుముల శంకర్, జయరాం యాదవ్, నాతరి స్వామి తదితరులు పాల్గొన్నారు.