పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం చలివేంద్రం ఏర్పాటు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం చలివేంద్రం ఏర్పాటు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ చొరవతో ఏర్పాటు

చెన్నూరు, వెలుగు: సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ చొరవతో చెన్నూర్​ బస్టాండ్​ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. దాన్ని కాంగ్రెస్ ​నాయకులు శుక్రవారం ప్రారంభించారు. కాళేశ్వరం వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో12 రోజులపాటు జరగనున్న పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పిల్లాపాపలతో రానున్నారని తెలిపారు. వారికి చల్లటి నీరు అందించే ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే, ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
  
బోర్​వెల్​ మంజూరు.. పనులు ప్రారంభం 

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలోని13వ వార్డు తాపీ భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో తాగునీటి వసతి కోసం ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి బోర్​వెల్ మంజూరు చేశారు. శుక్రవారం సంబంధిత పనులను తాపీ భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ ​ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2 నెలల క్రితం సంఘం భవనానికి ప్రహరీ, బోర్​వెల్​ కావాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కోరినట్లు తెలిపారు. 

వారు స్పందించి, మోటార్​ కనెక్షన్​తో బోర్​వెల్, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. కాంగ్రెస్​ లీడర్లు తిరుమల్​రెడ్డి, రాగిడి రాంరెడ్డి, నాగుల దుర్గయ్య, కోట రాజన్న, మద్దూరి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.