ప్రజలు కోరుకున్న మార్పు ఈరోజు వచ్చింది: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ప్రజలు కోరుకున్న మార్పు ఈరోజు వచ్చింది: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ప్రజలు కోరుకున్న మార్పు ఈరోజు వచ్చిందని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. డిసెంబర్ 7వ తేదీ గురువారం ఎల్బీ స్టేడియంలో సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం చెన్నూరుకు వెళ్లిన వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయనను కలిసేందుకు భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు.  తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల తో సమావేశం అయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  "బాల్క సుమన్ నే చెన్నూర్ ప్రజలు బట్టలు విప్పి కొట్టారు. అందరూ చట్టం ప్రకారం నడుచుకోవాలి. మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత 6 గ్యారంటీలపై సైన్ చేశారు. రూ.68 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన  ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. దానిపైన దర్యాప్తు చేయాలి.
దోచుకున్న ప్రజల సొమ్ము  సొత్తు తిరిగి తెచ్చుకోవాలి. ప్రతి మండలం తిరిగి ఏం కావాలో తెలుసుకుంటా. బ్యాక్ వాటర్ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తా. నా మీద చెన్నూర్ ప్రజలు చాలా ప్రేమ చూపించారు. మాజీ ఎమ్మెల్యే ఓదెలు ఇతర నాయకులకు, చెన్నూర్ ప్రజలకు కృత్ఞతలు.  చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారు. కొత్త నాయకులను పార్టీలో తీసుకునే అవసరం లేదు" అని అన్నారు.