
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ, వెలుగు: హన్వాడ మండల కేంద్రంలో ఆదివారం రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. హన్వాడ మండలంలో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. తాగునీటి కొరత తీర్చేందుకు 49 బోర్లు వేసినట్లు వివరించారు.
9511 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు, 41 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రూ. 5 లక్షలతో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇండ్లను ప్రారంభించారు. బాలాజీ దేవాలయం వద్ద రూ.20 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించనున్న షెడ్‌కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.