మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు: తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం ఆయన సందర్శించారు. నియోజకవర్గానికి చెందిన నవజాత శిశువుల తల్లులకు యెన్నం హెల్త్ కిట్‌ను పంపిణీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, చికిత్స, సిబ్బంది పనితీరును సమీక్షించారు.
వైద్యులు, నర్సులు, సిబ్బంది సేవలను అభినందిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రోగులతో వచ్చే సహాయకులు ఇబ్బంది పడకుండా టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రసవానంతరం తల్లులు, పిల్లలకు అవసరమయ్యే వస్తువులు హెల్త్ కిట్ లో అందజేస్తున్నట్లు తెలిపారు.
