ఎమ్మెల్యేలు ఆర్టీసీ ఉద్యోగులను బెదిరించి .. సమ్మె చేయించారు : తమిళిసై

ఎమ్మెల్యేలు ఆర్టీసీ ఉద్యోగులను బెదిరించి ..  సమ్మె చేయించారు :  తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆర్టీసీ ఉద్యోగుల ఎలాంటి సమ్మెకు పిలుపు ఇవ్వలేదని, కొందరు ఎమ్మెల్యేలు వారిని బెదిరించి రాజ్‌భవన్‌ ముట్టడి చేపట్టేలా ఒత్తిడి తీసుకువచ్చారని ఆమె ట్వీట్ చేశారు.  ఇది పూర్తిగా ప్రభుత్వ ప్రాయోజిత, బలవంతపు సమ్మె అని తన ట్వీట్ లో రాసుకోచ్చారు.  ప్రజలకు అసౌకర్యం కలిగించడానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారని  గవర్నర్ తెలిపారు.  

వీడియో కాన్ఫరెన్స్‌లో జేఎసీ  ప్రతినిధి ఒకరు తనకు ఈ విషయాన్ని తెలియజేసారని ఆమె చెప్పు్కొచ్చారు.  రాష్ట్ర ఉద్యోగుల క్షేమం కోసమే బిల్లులోని ఐదు అంశాలపై వివరణ  కోరినట్లుగా తమిళిసై వెల్లడించారు.  హడావుడిగా బిల్లులు పెట్టొదని.. సమగ్రంగా చర్చ జరగాలని చెప్పారు.   ఆర్టీసీ ఉద్యోగులు చేసిన  సమ్మె గురించి తెలుసుకుని తాను చాలా  బాధపడ్డానన్నారు.ఈ సమ్మె వల్ల ఉద్యోగులందరికీ ఒత్తిడితో పాటు సామాన్య ప్రజలకు కూడా అసౌకర్యం కలిగిందని గవర్నర్ తెలిపారు. 

తెలంగాణ ప్రభుత్వం పంపించిన ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ సంతకం చేయాలంటూ 2023 ఆగస్టు 05 శనివారం ఉదయం ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్‌ ముట్టడించారు.  నెక్లెస్‌రోడ్ మీదుగా ర్యాలీగా తరలివచ్చిన వేలాది మంది కార్మికులు రాజ్‌భవన్‌ ముందు బైఠాయించారు. గవర్నర్‌ బిల్లుపై సంతకం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఆందోళన చేశారు. దీంతో కొంతమంది కార్మిక సంఘాల నేతలతో వర్చువల్‌గా ద్వారా మాట్లాడిన గవర్నర్‌.. తాను ఎందుకు బిల్లుకు ఆమోదం తెలపలేదో వివరించారు.