వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం

గద్వాల, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ ఎమ్మెల్సీ డీఎస్  అరుణ్  ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో ప్రభాస్ యోజన ప్రోగ్రాంలో భాగంగా 303 బూత్ లు, 108 శక్తి కేంద్రాలు, గద్వాల పట్టణంలోని వార్డుల్లో పర్యటించినట్లు చెప్పారు. గతంలో డీకే అరుణ చేసిన అభివృద్ధే తప్ప, ఇప్పటి  ప్రభుత్వం చేసిన డెవలప్​మెంట్  కనిపించడం లేదన్నారు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. డబుల్ ఇంజన్  సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, శ్రీనివాసరెడ్డి, డీకే స్నిగ్దారెడ్డి, కబీర్​దాస్, నరసింహులు, నాగేందర్ యాదవ్  పాల్గొన్నారు.

నారాయణపేట: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని కర్ణాటక రాష్ట్రం శిమొగ్గ ఎమ్మెల్యే చెన్న బసప్ప చెప్పారు. జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, రతన్ పాండురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులుతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కేసీఆర్ కుటుంబం మాత్రమే డెవలప్​ అయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అవుసలి వెంకట్రాములు, నియోజకవర్గ కన్వీనర్  జీకే నర్సింలు, ట్రెజరర్​ వెంకట్రాములు, రఘురామయ్య గౌడ్, అపిరెడ్డిపల్లి రాము పాల్గొన్నారు.