ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జగిత్యాల, వెలుగు: ధాన్యం కొనుగోలులో అదనపు తూకం వేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్​ చేశారు. దీనివల్ల రైతులు క్వింటాల్ కు 5 కిలోలు నష్టపోతున్నారని చెప్పారు. రాయికల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహం నుంచి మార్కెట్ యార్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలు అమ్ముకునేందుకు రైతులు కష్ట పడాల్సి వస్తోందన్నారు.  

కాంగ్రెస్​ ఆందోళనలు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోయినపల్లి, కోరుట్ల, మెట్​పల్లి, కథలాపూర్​, వీణవంక, జమ్మికుంట, గంగాధర, వేములవాడ, గోదావరిఖనిలో కాంగ్రెస్​ శ్రేణులు గురువారం ఆందోళన  చేశారు. రాష్ట్రంలో రైతుల  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధరణి ని ఆపేసి, పాత పద్ధతిని కొనసాగించాలని సూచించారు. దాన్నివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ మేరకు ఆయా మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు  వినతి పత్రాలు అందించారు. 
 

కమర్షియల్​ కాంప్లెక్స్​కు భూమి పూజ

మెట్ పల్లి, వెలుగు : మార్కెట్ ఆవరణలో రూ. 2 కోట్ల 95 లక్షలతో నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ పనులకు  ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా  జాడు, హమాలి, దడువాయి కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం బల్దియా లో చైర్ పర్సన్ రానవెనీ సుజాత అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్నారు.  మీటింగ్​లో వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు , డీఈ మునిందర్, సెక్రెటరీ పుప్పాల రమణ, కౌన్సిలర్లు  తదితరులు పాల్గొన్నారు. .

కోరుట్ల : కోరుట్ల లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్​ లో రూ.45 లక్షల నిధులతో చైర్మన్ ఛాంబర్​, పబ్లిక్ టాయిలెట్స్ పనులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. అలాగే కల్లూరు రోడ్డు లోని జడ్పీహెచ్ ఎస్ గర్ల్స్ హై స్కూల్ లో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రేక్​ఫాస్ట్​ కార్యక్రమం ప్రారంభించి, స్కూల్ యూనిఫామ్ , టై, బెల్ట్, ఐడి కార్డులను పంపిణీ చేశారు. 

గురుకులాలకు ఇచ్చిన స్థలంలో ఫ్యాక్టరీలా?

మెట్ పల్లి, వెలుగు: మండలంలోని మెట్లచిట్టపూర్ శివారులో మూడు గురుకుల పాఠశాలలకు కేటాయించిన స్థలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మించడం సరికాదని ఆ  గ్రామ జేఏసీ నాయకులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఆఫీస్ లో గురువారం వారు మీడియాతో మాట్లాడారు. ఏడేండ్ల కిందట మూడు గురుకుల పాఠశాలలకు 45 ఎకరాల స్థలాన్ని సర్కారు మంజూరు చేసిందని, పాఠశాలలు ఏర్పాటు చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును ఫణంగా పెట్టి ఫ్యాక్టరీలు పెట్టడం ఏమిటని ఎమ్మెల్యే విద్యాసాగర్​ పై మండిపడ్డారు. ప్రస్తుతం అరకొర వసతులతో ఉన్న అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన భూమిలో గురుకుల పాఠశాలలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీల నిర్మాణం నిలిపి వేయాలని లేకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు పులి సంజీవ్, గ్రామ పెద్దలు సుంకేట ఆనంద్, ఉప సర్పంచ్ భూమేశ్వర్, గొర్రె భీమన్న, నేరెళ్ల భూమన్న, రెబస్ రాజం పాల్గొన్నారు. 

బాలింతల మరణాలకు ప్రభుత్వమే కారణం

జగిత్యాల, వెలుగు: వైద్యుల నిర్లక్ష్యం తో బాలింతలు చనిపోతున్నారని, దానికి కారణం ప్రభుత్వమే అని బీజేపీ నియోజకవర్గ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి అన్నారు. ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రి లో చనిపోయిన రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ కు చెందిన బాలింత మహేశ్వరి కుటుంబ సభ్యులను బీజేపీ నాయకులు గురువారం పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో గత కొద్దిరోజులుగా జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో బాలింతలు చనిపోతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఆపార్టీ మండల అధ్యక్షుడు వేణు, ఎంపీటీసీ  మహేశ్​, మండల ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్, ఉపాధ్యక్షుడు శ్రీరామ్ గౌడ్ ఉన్నారు.

ఆరోగ్య కేంద్రాన్ని విజిట్​ చేసిన ఉన్నతాధికారులు

కోనరావుపేట,వెలుగు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎన్ క్వాస్  ( నేషనల్​ క్వాలిటీ అస్యురెన్స్​ స్టాండర్డ్స్​) అధికారులు, డీఎంహెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్ రావు గురువారం తనిఖీ చేశారు. పీహెచ్ సీకి ఎన్​క్వాస్​ గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని  అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎన్ క్వాస్ టీమ్ సభ్యులు హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్, ల్యాబోరేటరీ, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్స్ వివరాలను  పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్ క్వాస్ స్టేట్ టీమ్ సభ్యులు స్టెల్లా, విద్యాసాగర్, డాక్టర్ మోహన కృష్ణ, డాక్టర్ చిరంజీవి, పీహెచ్ సీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్​ఎఫ్​ఐ జాతీయ మహాసభలను సక్సెస్​ చేయాలె

జగిత్యాల, వెలుగు : హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో డిసెంబర్ 13 నుంచి 16 వరకు జరిగే జాతీయ మహాసభలను సక్సెస్​ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ బైర మనీషా పిలుపునిచ్చారు. జిల్లా లోని ఎస్కేఎన్ఆర్ విమెన్స్​ జూనియర్​ కాలేజీలో విద్యార్థులతో కలిసి మహాసభల పోస్టర్​ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై ఎస్​ఎఫ్​ఐ పోరాటం చేస్తోందని చెప్తారు. అధ్యయనం, పోరాటం అనే నినాదంతో విద్యార్థులో చైతన్యం నింపుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానం - 2020 ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్​షిప్పులు విడుదల చేయాలన్నారు. కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు మర్రిపెల్లి మారుతి, జిల్లా సభ్యులు సుధన్ పాల్గొన్నారు.

పేషెంట్లకు చిరిగిన బెడ్ షీట్లా?

  కరీం నగర్​ టౌన్,వెలుగు: ప్రభుత్వ హాస్పిటల్ లో  పేషెంట్స్ కు చిరిగిన బెడ్ షీట్స్ ఇవ్వడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ అజయ్ సీరియస్​ అయ్యారు. గురువారం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ ను అజయ్ కుమార్ సందర్శించారు. రోగుల వివరాలను కేస్ షీట్లపై క్లియర్ గా నమోదు చేయాలని ఆదేశించారు. చిల్డ్రన్ , ఎమర్జెన్సీ, జనరల్ వార్డు, బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీ చేశారు. పేషెంట్ల దగ్గరికి వెళ్లి ఎలాంటి  సౌకర్యాలు కల్పిస్తున్నారని, మందులు ఎలా ఇస్తున్నారని, డాక్టర్లు సమాయానికి వస్తున్నారా అని తెలుసుకున్నారు.   డాక్టర్లు, సిబ్బంది డబ్బులు అడుగుతున్నారా? అని పేషెంట్ల నుంచి ఆరా తీశారు.  కేస్ షీట్లలో పేషెంట్లకు అందించే ఇంజక్షన్లు, మందులతో పాటు టైం ఎందుకు రాయడం లేదని,  టెంపరేచర్ ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ఇవేమీ తెలియకుండా వైద్యం ఎలా అందిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరిగిన బెడ్ షీట్లు ఎందుకు ఇస్తున్నారని మండిపడ్డారు. అయితే కమిషనర్ రాకను గమనించి సిబ్బంది రోగులను లేపి బెడ్లపై బెడ్ షీట్లు వేశారని  కమిషనర్​ గుర్తించి, సీరియస్​ అయ్యారు. 

వడ్లు కొంటరా.. సావమంటరా? మందు డబ్బాలతో రుద్రంగి రైతుల ఆందోళన 

చందుర్తి,వెలుగు: వడ్లను వెంటనే కొనాలని వేములవాడ – కోరుట్ల మెయిన్ రోడ్డు పై రైతులు గురువారం ధర్నా చేశారు. వరి కోతలు కోసి నెలలు గడుస్తున్నా ఇంకా వడ్లు కొనడం లేదని, పంటను కొంటరా? చనిపోవాలా అంటూ మందు డబ్బాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తరుగు పేరిట క్వింటాలుకు 6 నుంచి 8 కిలోల తీస్తున్నారని, సింగిల్ విండో సొసైటీ చైర్మన్, సీఈఓ నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయన్నారు. రెండు గంటలపాటు రైతులు ఆందోళన చేశారు.ఈ ధర్నాతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు రైతుల దగ్గర నుంచి మందు డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. కొనుగోలు సెంటర్ల నిర్వహకులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. దీంతోపాటు చందుర్తి లో సింగిల్ విండో సొసైటీ ముందు తూకం వేసిన వడ్ల బస్తాలను వేసి మల్లేశం అనే రైతు నిరసన తెలిపాడు మర్రి . 15 రోజులు గడిచినా తూకం వేయలేదని ఆవేదన చెందాడు. 

గండ్లు పడ్డ చెరువులకు రిపేర్లు చేయాలి

గంగాధర, వెలుగు : అధిక వర్షాలతో చెరువులకు పడిన గండ్లను వెంటనే పూడ్చి రబీ పంటలకు సాగునీరందించాలని మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్​ పరిధిలోని ఆరు గ్రామాల రైతులు డిమాండ్​ చేశారు. కరీంనగర్​- జగిత్యాల నేషనల్​ హైవే మధురానగర్​లో గురువారం రాస్తారోకో చేశారు. ఈ సందర్శంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నారాయణపూర్ రిజర్వాయర్, మంగపేట ఎల్లమ్మ చెరువులకు గండ్లు పడ్డాయని, కానీ వాటికి రిపేర్లు అధికారులు రిపేర్లు చేయడం లేదని చెప్పారు. ఈ చెరువుల వల్లే తమ పంటలకు నీళ్లు అందుతున్నాయని, గండ్లు పూడ్చకపోతే యాసంగిలో లక్షల ఎకరాలకు సాగు నీరు అందదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, గండ్లు పూడ్చేందుకు చొరవ చూపాలని తీసుకోవాలని కోరారు. రాస్తారోకోలో ఆయా గ్రామాల నుంచి సుమారు 250 మంది రైతులు పాల్గొన్నారు. 

నేషనల్​ డాడ్జ్ బాల్ పోటీలకు గాయత్రి స్టూడెంట్లు

పెద్దపల్లి, వెలుగు: నేషనల్​ డాడ్జ్​బాల్​ పోటీలకు గాయత్రి విద్యానికేతన్​ స్టూడెంట్లు ఎంపికయ్యారు. జిల్లాలోని అబ్దుల్ కలామ్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో స్టూడెంట్లు బొజ్జ అక్షర, కూన వరూధి, మారం శ్రావ్య, బండి సాత్విక్, గుగ్గిళ్ళ రవి కిరణ్ ప్రతిభ చూపి జాతీయ స్థాయికి సెలెక్ట్​​ అయ్యారు. మైసూర్ లో జరిగే జాతీయ పోటీలలో పాల్గొంటారని కోచ్​ ఓదెలు తెలిపారు. స్టూడెంట్లను విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ రజనీ అభినందించారు. 

ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐలో ప్రాధాన్యం ఇవ్వాలి ట్రిబ్యునల్​కు కార్మికుల వినతి 

గోదావరిఖని, వెలుగు : ఎఫ్​సీఐ రిటైర్డ్​ కార్మికులను ఆర్​ఎఫ్​సీఎల్​ బాధితులుగా గుర్తించి ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతూ పలువురు కార్మిక శాఖ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించారు. గురువారం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్టూ అధ్యక్షులు ఇనుగాల రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రెటరీ తోకల రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ మూసివేత సమయంలో 1400 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నప్పటికీ వారికి ఒక పైసా నష్టపరిహారం చెల్లించలేదన్నారు. లోడింగ్, అన్ లోడింగ్ చేసేందుకు బిహార్​ కార్మికులను పెట్టి నడిపిస్తున్నారు  తప్ప మాజీ కాంట్రాక్టు కార్మికులకు అవకాశం కల్పించలేదని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. 

కార్పొరేటర్ కుటుంబానికి బండి సంజయ్ పరామర్శ

కరీంనగర్ టౌన్, వెలుగు:బీజెపీ జిల్లా మహిళా మోర్చా  అధ్యక్షురాలు, కార్పొరేటర్ సీహెచ్. జయశ్రీ తండ్రి ఎం.సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా... ఆ పార్టీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి మనోధైర్యం కల్పించారు.