బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపింది: జీవన్ రెడ్డి

బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపింది: జీవన్ రెడ్డి

రాష్ట్ర హక్కులను కాపాడలేక పోయినా సీఎం కేసీఆర్.. కేంద్రం నుండి రావాల్సిన హక్కులను ఏ విధంగా సాధిస్తారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కుల సాధనలో.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కేసీఆర్ అసమర్థతకు చిహ్నమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 

లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా బీజేపీతో చేతులు కలిపారని జీవన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని విమర్శించారు. ప్రతీ పార్టీని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.