ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు 

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు 

జనగామ : బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవరికీ పాదాభివందనం చేయలేదని చెప్పారు. రాజకీయాల్లో తాను ఎవరికీ తల వంచలేదని, ఇకపై కూడా వంచబోనని వ్యాఖ్యానించారు. ‘ఆర్జించడం కాదు.. నిటారుగా ఆత్మగౌరవంతో నిలబడాలి. తప్పుచేసినోడే తలవంచుతాడు’ అని వ్యాఖ్యలు చేశారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అయితే.. ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి.. చేశారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.