పర్వతగిరి మండలంలో భక్తి శ్రద్ధలతో గంధం ఊరేగింపు

పర్వతగిరి మండలంలో  భక్తి శ్రద్ధలతో గంధం ఊరేగింపు

పర్వతగిరి, వెలుగు: వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో సోమవారం రాత్రి వైభవంగా ఉర్సు ఉత్సవాలు జరిగాయి. దర్గా ప్రధాన ముజేవార్​ బోలేషావలి ఇంటి వద్ద నుంచి గంధం ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఫకీర్లు చేసిన విన్యాసాలు, ఖవ్వాలి పాటలు ఆకట్టుకున్నాయి.  మంగళవారం హజ్రత్ సయ్యద్​యాకూబ్​బాబాకు గంధం సమర్పించారు. వేడుకలకు హాజరైన మతపెద్దలు, భక్తులు, యాత్రికులు మొక్కులు సమర్పించుకున్నారు. దీపారాధన, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాగా, ఎంపీవో శేషు ఆధ్వర్యంలో దర్గా సమీపంలో పారిశుధ్య పనులు చేపట్టారు. 

కార్యక్రమంలో సర్పంచ్​ గాడిపెల్లి మహేందర్, వక్ఫ్​బోర్డు అసిస్టెంట్​సెక్రటరీ అమీర్ అహ్మద్, ఉర్సు ఇన్​చార్జి ఫయాజ్​ అహ్మద్, ఇన్​స్పెక్టర్​ రియాజ్, ముజేవార్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మామునూర్​ ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సైలు ప్రవీణ్, వంశకృష్ణ​ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.