
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జిషీట్ లో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అయితే దీనిపై ఓ పత్రికలో పతాక శీర్షికన ప్రచురితమైన కథనాన్ని షేర్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ చేసిన ట్వీట్ పై కవిత స్పందించారు.
‘‘సమీర్ మహేంద్రు చార్జిషీట్ లో లిక్కర్ క్వీన్ పేరును 28 సార్లు ప్రస్తావించారు” అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యకు కౌంటర్ ఇచ్చారు. ‘‘రాజగోపాల్ అన్న.. తొందరపడకు.. మాట జారకు!! 28 సార్లు నా పేరు చెప్పించినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు”అని కవిత రిప్లై ఇచ్చారు.