ఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు, కేంద్ర బలగాలు

ఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు, కేంద్ర బలగాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ జరుగుతున్న ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించటం హై టెన్షన్ పెడుతుంది. మార్చి 21వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోకి వెళ్లిన కవిత.. తన వెంట ఫోన్లు కూడా తీసుకెళ్లారు. ఫోన్ల చుట్టూ విచారణ జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నా.. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా విచారణ కొనసాగటంతో ఉత్కంఠ నెలకొంది.  ఇదే సమయంలో ఆఫీస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

ఈడీ విచారణకు కవిత హాజరుకావటం ఇది మూడో సారి. మార్చి 20వ తేదీ రెండోసారి విచారణకు హాజరయిన సమయంలో 10 గంటల సమయం విచారించారు. హైటెన్షన్ తర్వాత బయటకు వచ్చారు. రెండోసారి విచారణ ఎదుర్కొన్న తర్వాత రోజే.. మళ్లీ రావాలని ఈడీ అధికారులు ఆదేశించటం.. సుదీర్ఘంగా విచారణ కొనసాగటం.. ఆఫీస్ ఎదుట మహిళా పోలీసులు భారీ సంఖ్యలో ఉండటం.. కేంద్ర బలగాలు మోహరించటం ఆసక్తి రేపుతోంది. 

రెండో రోజు విచారణ సందర్భంగా ఉన్న హడావిడి కంటే.. మూడోసారి విచారణ కూల్ గా సాగుతుంది. ఆఫీస్ బయట బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతల హంగామా పెద్దగా కనిపించటం లేదు. అయినా కూడా విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో.. ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది.