90 కిలోమీటర్లకు పెరిగిన ఎంఎంటీఎస్ నెట్ వర్క్

90 కిలోమీటర్లకు పెరిగిన ఎంఎంటీఎస్ నెట్ వర్క్
  • 90 కిలోమీటర్లకు పెరిగిన ఎంఎంటీఎస్ నెట్ వర్క్
  • అన్ని రూట్లలో కలిపి రోజుకు లక్షన్నర మంది వెళ్లే చాన్స్
  • తక్కువ ఖర్చుతో శివారు ప్రాంతాలకు జర్నీ

హైదరాబాద్/శంషాబాద్, వెలుగు : జంటనగరాల్లో  పబ్లిక్ కు ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీసులు పెరగనున్నాయి. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ 13 ఎంఎంటీఎస్ ట్రైన్లను ప్రారంభించారు. దీంతో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్, సికింద్రాబాద్ నుంచి ఉందా నగర్ ( శంషాబాద్ ), మేడ్చల్ సికింద్రాబాద్, తెల్లాపూర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం సిటీలో 48 కి.మీ ఎంఎంటీఎస్ నెట్ వర్క్ ఉండగా తాజాగా అది 90 కిలోమీటర్ల వరకు పెరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో నిత్యం ఇపుడు జర్నీ చేస్తున్న ప్యాసింజర్ల కంటే మరో లక్షన్నర మంది కొత్త ట్రైన్లలో జర్నీ చేయనున్నారు.

మరోవైపు టికెట్ ధర రూ.5 నుంచి మొదలై రూ.20 వరకు ఉండొచ్చని.. తక్కువ టైమ్ లో సిటీలో ఓ ప్రాంతం నుంచి మరో చోటకు వెళ్లొచ్చని అధికారులు చెబుతున్నారు. ఉందానగర్ నుంచి లింగంపల్లి వరకు కొత్త ఎంఎంటీఎస్ ట్రైన్ ను మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ, బీజేపీ నాయకులతో కలిసి ఉందానగర్ స్టేషన్​లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఉందానగర్ నుంచి బుద్వేల్ వరకు ఆయన ప్రయాణించారు.