
పులి.. ఈ పేరు వినగానే అమ్మో పులి అంటూ వణుకు వస్తుంది.. పులి కనిపిస్తే భయమేస్తోంది.. పులి అన్న మాటనే భయానికి ఓ సింబల్.. అలాంటి పులి.. అందులోనూ బెంగాల్ టైగర్.. ఇంకెలా ఉంటుంది.. బెంగాల్ టైగర్ ను చూస్తేనే భయమేస్తుంది.. అలాంటి పులిని వెంటాడు.. వేటాడి మరీ చంపారు.. చంపిన పులిని అలానే వదిలేయలేదు.. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు.. కాళ్లు, చేతులు, చెవులు, గోళ్లు, చర్మం వలిచారు.. ఎవరికి కావాల్సింది వాళ్లు పట్టుకెళ్లారు.. ఒకరా ఇద్దరా కాదు.. ఏకంగా వెయ్యి మంది జనం.. మూకుమ్మడిగా బెంగాల్ టైగర్ ను వెంటాడి వేటాడి ఈ దారుణానికి ఒడిగట్టారు.. ఇది ఎక్కడో కాదు.. మన దేశంలోనే జరిగింది. ఒళ్లు వణికించేలా ఉన్న ఈ ఘటన పూర్తి వివరాలు..
అసోం రాష్ట్రం.. గోలాఘాట్ జిల్లాని దుసుతిముఖ్ గ్రామం. ఈ ఊరు అటవీ ప్రాంతానికి దగ్గరకు ఉంటుంది. నెల రోజుల క్రితం.. పులి దాడిలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. గ్రామంలోని కొన్ని మేకలు, పందులు కూడా పులి దాడిలో చనిపోయాయి. దీనిపై ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులు కంప్లయింట్ చేశారు. విచారణ చేస్తాం.. పులి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్న కోపం గ్రామస్తుల్లో పెరిగింది.
సరిగ్గా ఈ సమయంలోనే.. 2025, మే 22వ తేదీన అడవిలో పులి కనిపించింది.. ఈ ప్రాంతంలో పులి ఉంది అంటూ గ్రామస్తుడు ఒకడు ఊర్లో వాళ్లకు చెప్పారు. అప్పటికే నెల రోజులుగా పులిపై కోపంతో ఉన్న గ్రామం మొత్తం ఒక్కటి అయ్యింది. ఇళ్లల్లోని కత్తులు, పదునైన ఆయుధాలతో గ్రామంలోని వెయ్యి మంది పులి వేటకు వెళ్లారు. అనుకున్నట్లుగానే పులి కనిపించింది. అంతే.. అందరూ పులి వెంటాడి.. వెటాడారు.. ఎట్టకేలకు పులిని చుట్టుముట్టి చంపేశారు.
Also Read : దేశంలో విజృంభిస్తోన్న కరోనా
విషయం ఫారెస్ట్ అధికారులకు తెలిసింది. వాళ్లు వచ్చారు. జనం వినలేదు. వాళ్లపైనా దాడి చేశారు. ముగ్గురు ఫారెస్ట్ కానిస్టేబుల్ గాయపడ్డారు. చనిపోయిన పులిని అలా వదిలేయలేదు గ్రామస్తులు. దాన్ని ముక్కలుగా నరికేశారు. ఆ తర్వాత పులి గోళ్లు, చర్మ, దంతాలు, కాళ్లు, చేతులు, చెవులు ఇలా ఎవరికి తోచించి వాళ్లు ఎత్తుకెళ్లారు. పులి చంపటం విన్నాం కానీ.. పులినే ఇంత దారుణంగా చంపటం ఇదే అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. ఈ ఘటన మే 22వ తేదీ ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య.. కాజీరంగ నేషనల్ పార్క్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో జరిగినట్లు ఫీల్డ్ డైరెక్టర్ సోనాలి ఘోష్ వెల్లడించారు.
మిగిలిపోయిన పులి ముక్కలను పోస్టుమార్టం చేయగా.. పదునైన ఆయుధంతోనే చంపారని స్పష్టం చేశారు పశువైద్య డాక్టర్లు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు ఫారెస్ట్ అధికారులు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. భూమిపై జీవించే హక్కు మనుషులకు ఎంత ఉందో.. జంతువులకు కూడా అంతే ఉందని.. ఇలాంటి చర్యలను సహించేది లేదన్నారు. పులల రక్షణతోపాటు గ్రామాల్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఏదిఏమైనా బెంగాల్ టైగర్ ను చంపిన తీరు చూస్తుంటే.. పులి కంటే.. మిమ్మల్ని చూస్తుంటేనే భయంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేయటం విశేషం. క్రూర జంతువునే... అత్యంత క్రూరంగా చంపే ఆలోచన మనుషుల్లో రావటం అనేది భయానకంగా ఉందంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.