- మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
సంగారెడ్డి, వెలుగు: దేశంలో 12 ఏళ్ల పాటు సుపరిపాలన అందించిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గురువారం సంగారెడ్డి బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా దేశంలో సుపరిపాలన అందించారన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవ చేసిన ప్రధానిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. మాజీ ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, జిల్లా మీడియా ఇన్చార్జి విఠల్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, రాజేశ్వరరావు దేశ్పాండే, జగన్, మాణిక్ రావు, భాస్కర్ పాల్గొన్నారు.
