మోడీ ‘మన్ కీ బాత్’ మీ కోసం

మోడీ ‘మన్ కీ బాత్’ మీ కోసం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ‘మన్ కీ బాత్’ 64 వ భాగంలో మాట్లాడారు. అందులో కరోనావైరస్ వల్ల దేశం ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించారు. ప్రజలంతా కలిసి కరోనాను తరిమికొట్టారని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే కలిసి దేన్నయినా ఎదుర్కొవాలని ఆయన అన్నారు.

‘దేశంలో చాలావరకు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలి. కరోనా పోరాటంలో మన జీవన విధానమే మన బలం. కరోనాపై పోరాటంలో ప్రజలు కలిసివచ్చారు. ప్రజల మద్ధతుతో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. కరోనాపై దేశమంతా యుద్ధం చేస్తోంది. క్లిష్టసమయంలో పోలీసులు, వైద్యులు, మీడియా మిత్రులు ప్రాణాలొడ్డి పనిచేశారు. స్వచ్ఛంద సంస్థలు అన్నార్థులకు అండగా నిలిచాయి. తమిళనాడు డాక్టరు పేదల కోసం రూ. 5 లక్షలు ఖర్చుచేశాడు. పంజాబ్‌లో ఓ దివ్యాంగుడు ప్రజలకు మాస్కులు పంచాడు. మహిళా సంఘాల సభ్యులు కోట్లాది మాస్కులు తయారుచేస్తున్నారు. కరోనా భారత్‌లోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదమని అందరూ భావించారు. వ్యాపారులు భౌతికదూరం పాటిస్తూ అమ్మకాలు జరుపుతున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. భవిష్యత్తులో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. వైరస్‌ను ఎదర్కొనేందుకు ఇమ్యూనిటీ పెంచుకోవాలి. యోగాసానాల ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థికరంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా వల్ల వలసకూలీలు చాలా ఇబ్బందులు పడ్డారు. శ్రామిక్ రైళ్ల ద్వారా వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. వలసకూలీల కోసం వారి గ్రామాలలో కూడా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. యావత్ దేశం వలస కూలీలకు అండగా నిలిచింది. లాక్డౌన్‌లో విద్యారంగంలో అనేక ఆవిష్కరణలు చేశారు. ఆన్‌లైన్ పాఠాల కోసం కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా ముందుడుగు వేశాం. ఆయుష్మాన్ భారత్ పేద ప్రజలకు వరంగా మారింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోటిమందికి పైగా చికిత్స తీసుకున్నారు. ఆ కోటి మందిలో 80 శాతం మంది గ్రామీణులే కావడం గమనార్హం. పేదల డబ్బును ఆయుష్మాన్ భారత్ యోజన ఆదా చేస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాలు తక్కువ. కరోనా కట్టడిలో ఇతర దేశాల కంటే భారత్ ముందుంది. కరోనాపై మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది’ అని మోడీ అన్నారు.

For More News..

పంచాయతీ కార్యదర్శి సోదరికి కరోనా.. ఊరంతా టెన్షన్

తాజ్ మహల్ గోడ కూలి ముగ్గురు మృతి

కిలో మిడతలు పట్టి తెస్తే రూ.20

రాష్ట్రంలో ‘అన్​లాక్’పై నేడు సీఎం రివ్యూ