మోడీ ఫస్ట్ ప్రెస్ మీట్… ప్రశ్నలకు బదులిచ్చిన అమిత్ షా

మోడీ ఫస్ట్ ప్రెస్ మీట్… ప్రశ్నలకు బదులిచ్చిన అమిత్ షా

పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి ప్రధానమంత్రి హోదాలో మొట్టమొదటి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు నరేంద్రమోడీ. మే 19వ తేదీన లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ కు ప్రచారం ముగుస్తుండటంతో.. ఆయన మీడియా ముందుకొచ్చారు. బీజేపీ గెలుపు ఖాయం అని ధీమాగా చెప్పారు.

ప్రెస్ మీట్ లో అమిత్ షా ముందు మాట్లాడారు. ఆ తర్వాత ప్రధాని మోడీ మాట్లాడారు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ లో అమిత్ షా ఒక్కరే పాల్గొన్నారు. సాధ్వి ప్రజ్ఞా -గాడ్సే వివాదం, రాఫెల్ ఒప్పందంలో పక్షపాతం, వెస్ట్ బెంగాల్ లో హింస, మహారాష్ట్రలో పొత్తు, బీజేపీకి బలంగా ఉన్న రాష్ట్రాలు.. లాంటి ప్రశ్నలన్నింటికీ అమిత్ షానే సమాధానం చెప్పారు.