2022కల్లా అందరికీ ఇళ్లు ఇవ్వాల్సిందే : మోడీ

2022కల్లా అందరికీ ఇళ్లు ఇవ్వాల్సిందే : మోడీ

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని తన ఆఫీస్ లో అధికారులు, శాఖల మంత్రులతో సమావేశం అయ్యారు. రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక తొలిసారి ప్రగతి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. హౌజింగ్ ఫర్ ఆల్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకున్నదో అధికారులకు మరోసారి వివరించారు. 2022కల్లా దేశంలోని అర్హులైన ప్రతి వారికి ఇల్లు ఇవ్వాల్సిందేనని అధికారులకు డెడ్ లైన్ పెట్టారు మోడీ.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ ఆయుష్మాన్ భారత్, సుగమ్య భారత్ అభియాన్ పథకాలపైనా రివ్యూ చేశారు ప్రధాని మోడీ. ఈ పథకాల ఫలాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు మోడీ.