ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రమాణం

ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రమాణం

భారత ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్ ముందు ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ … నరేంద్రమోడీతో ప్రమాణం చేయించారు. సాయంత్రం ఏడు గంటలకు ప్రధాని ప్రమాణ స్వీకారం చేశారు.

జాతీయ గీతం పాడిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైంది. మోడీ ప్రమాణం చేసిన తర్వాత ప్రధానిగా రికార్డులపై సంతకం చేశారు.

భారత ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు నరేంద్రమోడీ. 2014లో మొదటిసారి.. 2019లో తాజాగా రెండోసారి దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు మోడీ.

ప్రధానమంత్రిగా మోడీతోపాటు.. మిగతా మంత్రులు కూడా ప్రమాణం చేశారు.