30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

30 అడుగుల  అల్లూరి  విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

ఏపీలోని భీమవరంలో అల్లూరి125 వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలుగు ప్రజల మనసును దోచారు. అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ..  తెలుగులో తన ప్రసంగాన్ని మొదలు పెట్టి అందరినీ ఆకట్టుకున్నారు. అల్లూరి పుట్టిన గడ్డ అంటూ కొనియాడారు.‘ మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు, తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగర, స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతానికి స్పూర్తిగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనం అందరం కలుసుకోవడం మన అదృష్టం’ అంటూ మాట్లాడారు. ఈ సభలో అల్లూరి వారసులను సన్మానించారు మోడీ.