మానవాళికి ఎలాంటి సాయమైనా చేస్తాం

మానవాళికి ఎలాంటి సాయమైనా చేస్తాం

ప్రతికూల పరిస్థితుల్లోనే స్నేహం మరింత పెరుగుతుంది
ట్రంప్​ కామెంట్లపై ట్విట్టర్​ లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మానవత్వంతో ఎలాంటి సహాయం చేయడానికైనా ఇండియా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. యాంటీ మలేరియా డ్రగ్​ హైడ్రాక్సి క్లోరోక్విన్​ ఎగుమతులకు అంగీకరించడంపై ఇండియాకు అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ థ్యాంక్స్​ చెప్పారు. “థాంక్యూ ప్రైమ్​ మినిస్టర్​ నరేంద్ర మోడీ. మీ బలమైన నాయకత్వం ఇండియాకే కాదు.. మొత్తం మానవాళికే ఈ పోరాటంలో ఎంతో సాయం చేస్తోంది”అని ట్రంప్​ ట్వీట్​ చేశారు. మోడీ అద్భుతమైన వ్యక్తి అని, ఆయన చేసిన సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనంటూ పేర్కొన్నారు. దీనిపై ట్విటర్​ లో స్పందించిన ప్రధాని మోడీ “ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే స్నేహం మరింత పెరుగుతుంది. ఇండో–యూఎస్​ మధ్య సంబంధాలు గతం కంటే ఇప్పుడు చాలా బలపడ్డాయి. కరోనాపై పోరాటంలో మానవాళికి ఎలాంటి సాయం చేసేందుకైనా ఇండియా రెడీగా ఉంటుంది”అని ట్వీట్​ చేశారు.