BJP నేతలు తప్పులు చేస్తే సహించను… మోడీ వార్నింగ్

BJP నేతలు తప్పులు చేస్తే సహించను… మోడీ వార్నింగ్

పెద్ద నేతలైనా.. వారి కొడుకులైనా సహించను

పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో మోడీ వార్నింగ్

బీజేపీ నేతలు ఇటీవల పలు వివాదాల్లో ఇరుక్కోవడంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ అంశంపై పార్టీ నాయకులతో ప్రధాని నరేంద్రమోడీ చర్చించారు. బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పులు చేస్తే… అది మొత్తం బీజేపీకి మచ్చ తెస్తుందని మోడీ చెప్పారు. అలాంటి చర్యలను పార్టీ సహించదని అన్నారు. తప్పు ఎవరు చేసినా.. చర్యలు మాత్రం తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పారు. సీనియర్ నేతలైనా.. వారి కొడుకులైనా.. ఎవ్వరినీ చూస్తూ ఊరుకునేది లేదన్నారు. మోడీ పార్టీ నాయకులకు ఈ విషయంలో కఠినమైన ఆదేశాలు ఇచ్చారని మాజీ మంత్రి, ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ మీడియాకు చెప్పారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ వర్గియా.. ఓ ప్రభుత్వ అధికారిని బ్యాట్ తో కొట్టాడు. ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ సంఘటనపై దేశమంతటా చర్చ జరిగింది. దీంతో.. ప్రధాని మోడీ ఈ విషయంపై స్పందించి.. పార్టీ నేతలకు కీలక హెచ్చరికలు చేశారు.