
ఫిర్ ఏక్ బార్ మోడీ నినాదంతో వెళ్లిన బీజేపీకి దేశప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ ఒంటరిగా 292 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మిత్రపక్షాలతో కలిసి 343 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో 91 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ ఒంటరిగా 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
2014 ఎన్నికల్లో 282 స్థానాలతో బీజేపీ సంచలన విజయం సాధించింది. దశాబ్దాల తర్వాత మెజారిటీ సీట్లు గెల్చుకుని.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అధికారం దక్కించుకుంది. అదే రిజల్ట్ ను 2019లోనూ రిపీట్ చేస్తోంది బీజేపీ. గతంలో సాధించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లను ఈసారి గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీ, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని అంచనాలు ఉన్నప్పటికీ.. ఫలితాలు వాటిని పటాపంచలు చేశాయి. యూపీలో హాఫ్ సెంచరీ దాటి… భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. వెస్ట్ బెంగాల్ లోనూ తృణమూల్ కాంగ్రెస్ ను మించిన సీట్లు గెల్చుకునే పరిస్థితిఉంది.