మెగా బ్రదర్స్ తో మోదీ.. ఆసక్తిగా మారిన సన్నివేశం

మెగా బ్రదర్స్ తో మోదీ.. ఆసక్తిగా మారిన సన్నివేశం

ఏపీలో సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకున్నది. ముఖ్య అతిధిగా హాజరైన ప్రధాని మోదీ వ్యవహరించిన తీరు షాక్ కు గురి చేసింది అనొచ్చు. మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత.. ప్రధాని మోదీ వేదిక నుంచి దిగి వెళ్లే సమయంలో.. పవన్ కల్యాణ్ ను తన చేతులతో స్వయంగా  తీసుకొచ్చారు. పవన్ కల్యాణ్ ను.. చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి.. చిరు, పవన్ లతో ముచ్చటించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మధ్యలో ఉండి.. చిరంజీవి, మంత్రి పవన్ కల్యాణ్ చేతులతో ఎత్తి ప్రజలకు అభివాదం చేశారు. 

వేదికపై సీఎం చంద్రబాబు ఉన్నారు.. కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబును కాదని.. పవన్ కల్యాణ్ తో కలిసి చిరంజీవితో కలిసి ప్రధాని మోదీ అభివాదం చేయటం అనేది ఆసక్తికర అంశంగా మారింది.ఈ క్రమంలో చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత మోడీ, బాబులు ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం అందరిని ఆకట్టుకోగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో మోడీ చేసిన సందడి కార్యక్రమానికే హైలైట్ గా నిలిచింది.

సభ నుండి వెళ్లే ముందు వేదిక మీద ఉన్నవారిని పలకరించారు మోడీ, ఈ క్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో కలిసి మోడీ అభివాదం చేయటంతో కార్యక్రమం ఆసక్తికరంగా మారింది. ఈ సీన్ పట్ల మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసిన తర్వాత చిరంజీవి కాళ్ళు తాకి ఆశీర్వాదం తీసుకోవటం పట్ల మెగా ఫ్యాన్స్ ని భావోద్వేగానికి లోనవుతున్నారు. మొత్తానికి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగా బ్రదర్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి.