శ్రీలంకపై 5 వికెట్లు .. వరల్డ్ కప్ హిస్టరీలో షమీ రికార్డు

శ్రీలంకపై 5 వికెట్లు .. వరల్డ్ కప్ హిస్టరీలో షమీ రికార్డు

వరల్డ్ కప్లో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి వరుసగా ఏడో  విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది భారత్ . 358 పరుగుల భారీ స్కోర్ ను చేధించేందుకు  బరిలోకి దిగిన లంక జట్టును భారత బౌలర్లు కేవలం 55 పరుగులకే మట్టికరిపించారు.  లంక ఆటగాళ్లలో ఐదుగురు డకౌటటయ్యారు.  దీంతో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.  

అయితే లంక ఆటగాళ్లను ఒకొక్కరిని పెవిలియన్ కు పంపుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన  మహ్మద్ షమీ  వరల్డ్ కప్లో  అరుదైన రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.  లంకపై ఐదు వికెట్లు తీసిన షమీ ..  వరల్డ్ కప్లో 14 ఇన్నింగ్స్ లో 45 వికెట్లు పడగొట్టి జహీర్ ఖాన్(44) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.  వీరి తరువాత జావగల్ శ్రీనాథ్(44), బుమ్రా(33), కుంబ్లే (31) ఉన్నారు.   

జహీర్ ఖాన్ 33 మ్యాచ్ లలో 44 వికెట్లు తీయగా,   జావగల్ శ్రీనాథ్ 23 మ్యాచ్ లలో 44 వికెట్లు తీశాడు.   కాగా షమీకి వరల్డ్ కప్ లో ఇది మూడో ఐదు వికెట్లు  కావడం విశేషం.  కాగా, శ్రీలంకపై 302 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. శ్రీలంక 55 ఆలౌట్ కావడం ప్రపంచకప్ చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఈ ఓటమితో శ్రీలంక జట్టు ఈ మెగా టోర్నీ నుంచి నిష్ర్కమించింది.