దేశవాళీ సీజన్‌‌‌‌కు రెడీ అవుతోన్న షమీ

దేశవాళీ సీజన్‌‌‌‌కు రెడీ అవుతోన్న షమీ

న్యూఢిల్లీ:  టీమిండియాకు దూరమైన వెటరన్ పేసర్ మహ్మద్ షమీ రాబోయే దేశవాళీ సీజన్‌‌‌‌కు రెడీ అవుతున్నాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగనున్నాడు. 34 ఏండ్ల షమీ చివరిగా 2023లో  వరల్డ్ టెస్టు చాంపియన్‌‌‌‌షిప్ ఫైనల్లో ఇండియా తరఫున రెడ్‌‌‌‌ బాల్ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున ఒక మ్యాచ్‌‌‌‌లో బరిలోకి దిగాడు. ఐపీఎల్ తన కొత్త జట్టు సన్‌‌‌‌రైజర్స్ హైదరాబాద్ తరపున తొమ్మిది మ్యాచ్‌‌‌‌ల్లో ఆరు వికెట్లు మాత్రమే తీసి నిరాశ పరిచాడు.

 ఇప్పుడు  డొమెస్టిక్ రెడ్ -బాల్ క్రికెట్‌‌‌‌లో సత్తా చాటి మళ్లీ నేషనల్ టీమ్‌‌‌‌లోకి రావాలని చూస్తున్నాడు. ఇషాన్ కిషన్ కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించే ఈస్ట్ జోన్ జట్టులో షమీతో పాటు ఇండియా పేసర్లు ఆకాశ్‌‌‌‌ దీప్, ముకేశ్‌‌‌‌ కుమార్, ఆల్‌‌‌‌రౌండర్ రియాన్ పరాగ్ కూడా చోటు దక్కించుకున్నారు. ఇండియా టెస్ట్ జట్టుకు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్ వైస్ కెప్టెన్‌‌‌‌గా వ్యవహరిస్తాడు.  ఈస్ట్ జోన్ జట్టు తమ తొలి మ్యాచ్‌‌‌‌ను ఈ నెల 28 నుంచి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌‌‌‌లెన్స్‌‌‌‌లో జరిగే నార్త్ జోన్‌‌‌‌తో ఆడనుంది.

ఈస్ట్ జోన్ టీమ్‌‌‌‌: ఇషాన్ కిషన్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డానిష్ దాస్, శ్రీదాం పాల్, శరణ్‌‌‌‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ సింధు జైస్వాల్, ముకేష్ కుమార్, ఆకాశ్‌ దీప్, మహ్మద్ షమీ. స్టాండ్‌‌‌‌ బై: ముక్తార్ హుస్సేన్, ఆశీర్వాద్ స్వైన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్.