Mohammed Siraj Ruled Out: ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో త్వరలో జరగబోయే టీ20 సిరీస్‌ల కోసం బీసీసీఐ (BCCI) జూన్ 6వ తేదీన భారత జట్టును ప్రకటించింది. గాయాలు, సీనియర్లకు విశ్రాంతి, సరికొత్త రికార్డులతో ఈ జట్టు ఎంపిక ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ సిరీస్ ల కంటే ముందే భారత జట్టుకి బిగ్ షాక్ తగిలింది. ఇండియన్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ చీలమండ గాయంతో దూరం అయ్యాడు.
మహమ్మద్ సిరాజ్ ఔట్.. ప్రసిద్ధ్ కృష్ణ ఇన్!
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గాయం కారణంగా ఈ రెండు టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 (IPL 2026) ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా సిరాజ్ మడిమకు (Ankle) గాయమైంది. ఆ నొప్పిని భరిస్తూనే అతడు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కానీ, రాబోయే సుదీర్ఘ అంతర్జాతీయ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, అతడి వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికి విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. సిరాజ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు.
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సూర్యకుమార్ కు రెస్ట్:
ఈ జట్టు ప్రకటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే.. శ్రేయస్ అయ్యర్‌ను టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించడం.. 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్ పగ్గాలు చేపట్టనున్నాడు. సూర్యకుమార్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే యువ ఆటగాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
►ALSO READ | భారత్ మహిళల జట్టులో గట్టి పోటీ.. ఎవరికీ చోటు ఇవ్వాలో అర్థం కావడం లేదన్న స్మృతి మందానా
సచిన్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన వైభవ్:
ఈ స్క్వాడ్ సెలెక్షన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన హైలైట్.. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీమిండియా నుంచి పిలుపు రావడం. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆరెంజ్ క్యాప్ (Orange Cap), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (MVP) అవార్డులను గెలుచుకున్న వైభవ్‌కు జాతీయ జట్టులో చోటు దక్కింది.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.
🚨 News 🚨
— BCCI (@BCCI) June 9, 2026
Prasidh Krishna replaces Mohd. Siraj in #TeamIndia's T20I squads for Ireland & England.
Siraj has been advised a period of rest as part of his workload management programme.
More Details 🔽 | #IREvIND | #ENGvINDhttps://t.co/LNPOVVVHq5
