రోడ్డుకెక్కి, టీవీలకెక్కి రచ్చ చేయొద్దు

రోడ్డుకెక్కి, టీవీలకెక్కి రచ్చ చేయొద్దు

రోడ్డుకెక్కి, టీవీలకెక్కి రచ్చ చేయవద్దని ‘మా’ సభ్యులనుద్దేశించి మోహన్ బాబు అన్నారు. మీలో మీరు మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని మోహన్ బాబు సూచించారు. సినీ పరిశ్రమకు తాను ఏం చేశానో ఆ భగవంతునికి తెలుసనని ఆయన అన్నారు. ఇండస్ట్రీలో నువ్వు గొప్పనా? నేను గొప్పనా? ఉండదని, ఎవరి దయాదక్షిణ్యాలు సినిమా ఇండస్ట్రీలో ఉండవని.. టాలెంట్ మాత్రమే పనికొస్తుందని మోహన్ బాబు అన్నారు. ‘జయాపజయాలు దైవాధీనం. అన్నింటినీ ఎదిరించి నా బిడ్డను గెలిపించిన మీ రుణం నేను తీర్చుకోలేను’ అని ‘మా’ సభ్యులనుద్దేశించి మోహన్ బాబు మాట్లాడారు. నా బిడ్డను గెలిపించిన మీరే విష్ణుకు దేవుళ్ళని ఆయన అన్నారు. కుర్చీని, అందులో కూర్చున్న వ్యక్తిని గౌరవించి, రాగద్వేషాలు వదిలేసి అందరం కలిసి పనిచేయాలని మోహన్ బాబు సూచించారు. ‘నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. దేశం గర్వించదగ్గ ఖ్యాతి ‘మా’ కు తీసుకురావాలి. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి’ అని మోహన్ బాబు అన్నారు.

సిఎం కేసీఆర్ ను కలిసి పేద కళాకారులకు సాయం చేయాలని కోరుతా.. ఆయన మాట ఇచ్చి తప్పే వ్యక్తి కాదని అన్నారు మోహన్ బాబు.