ఒడిశా సీఎంగా మోహన్​ మాఝి ప్రమాణం

ఒడిశా సీఎంగా మోహన్​ మాఝి ప్రమాణం
  •     డిప్యూటీ సీఎంలుగా కనక్​వర్ధన్​​, ప్రవతి
  •     హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ

భువనేశ్వర్​: ఒడిశా కొత్త సీఎంగా మోహన్​ చరణ్​ మాఝి  ప్రమాణం చేశారు. భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జనతా మైదానంలో గట్టి బందోబస్తు మధ్య బుధవారం అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. మోహన్​ చరణ్​ మాఝితో గవర్నర్​ రఘుబర్​ దాస్​ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతోపాటు పలువురు ఎన్డీయే కూటమి నేతలు హాజరయ్యారు. మోహన్​ మాఝితోపాటు ఉపముఖ్యమంత్రులుగా కేవీ సింగ్ డియో, ప్రవతి పరీదా  ప్రమాణం చేశారు.  

రాష్ట్రంలో బీజేపీ మొదటి సీఎం 

 ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకుగానూ 78 సీట్లను బీజేపీ కైవసం చేసుకున్నది. బీజేడీ 51 సీట్లకే పరిమితమైంది. దీంతో కియోంజర్​నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మోహన్​ చరణ్​ మాఝీని శాసనసభ్యుల సమ్మతి మేరకు బీజేపీ అధిష్టానం సీఎంగా ప్రకటించింది. ఆయనతో పాటు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కనక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేవ్, తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రవతి పరీదాలను ఉపముఖ్యమంత్రులుగా ఎంపిక చేశారు. మాఝీ రాష్ట్రానికి 15వ సీఎం. అలాగే, మొదటి బీజేపీ సీఎం కావడం విశేషం.