
మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘దృశ్యం’ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అవడంతో పాటు తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ రీమేక్ అయింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ కూడా సక్సెస్ సాధించింది. ఈ రెండింటినీ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. అయితే ఇది ‘దృశ్యం’ సీక్వెల్ కాదు. దీనికి ‘నేరు’ అనే టైటిల్‌ని ఫైనల్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ, కొన్ని ఫోటోస్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు మోహన్ లాల్. మరికొన్ని స్నీక్ పిక్స్, అప్‌డేట్స్ త్వరలోనే రివీల్ చేస్తామన్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరుంబవూరు దీన్ని నిర్మిస్తున్నారు. కొచ్చి, తిరువనంతపురంలో ఎక్కువ భాగం షూటింగ్ జరుగనుంది. మరోవైపు ‘వృషభ’ అనే పాన్ ఇండియా మూవీలో మోహన్ లాల్ నటిస్తున్నారు.