మోహన్‌‌‌‌లాల్, జీతూ జోసెఫ్‌‌‌‌ కాంబినేషన్ లో మరో మూవీ

మోహన్‌‌‌‌లాల్, జీతూ జోసెఫ్‌‌‌‌ కాంబినేషన్ లో మరో మూవీ

మోహన్‌‌‌‌లాల్, జీతూ జోసెఫ్‌‌‌‌ కాంబినేషన్ అనగానే దృశ్యం, దృశ్యం‌‌‌‌‌‌‌‌2 సినిమాలు గుర్తొస్తాయి. మొదటిది థియేటర్స్‌‌‌‌లో బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ హిట్ సాధిస్తే, రెండోది ఓటీటీ ద్వారా విడుదలై సూపర్ సక్సెస్‌‌‌‌ను అందుకుంది. ఇప్పుడీ కాంబినేషన్‌‌‌‌లో మరో సినిమా వస్తోంది. అదే ‘ట్వల్త్ మేన్‌‌‌‌’. ‘దృశ్యం‌‌‌‌‌‌‌‌2’లాగే ఇది కూడా ఓటీటీ (డిస్నీ ప్లస్‌‌‌‌ హాట్‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌)లో రిలీజవుతుంది. నిన్న టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ‘ప్రతి ఒక్కరికీ మూడు జీవితాలుంటాయి. అందులో ఒకటి పబ్లిక్ లైఫ్, మరొకటి ప్రైవేట్ లైఫ్... ఇంకొకటి సీక్రెట్ లైఫ్’ అంటూ మొదలైన ఈ టీజర్ ఆకట్టుకుంది. ఫైనల్ విజిల్ వేసే సమయం వచ్చింది అంటూ చివర్లో మోహన్ లాల్‌‌‌‌ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఉన్ని ముకుందన్, సైజు కురుప్, శివద, అను సితార, అనుశ్రీ, ప్రియాంక నాయర్, అను మోహన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లాల్‌‌‌‌, జీతూల గత రెండు చిత్రాల్లాగే ఇది కూడా ఓ మిస్టరీ థ్రిల్లర్. ఆ రెండింటిలాగే ఇదీ హిట్టు కొడుతుందేమో చూడాలి!