
మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘లూసిఫర్’ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అవడంతో పాటు ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఇప్పటికే దీనికి సీక్వెల్‌ను అనౌన్స్ చేశాడు.
‘ఎంపురాన్’ టైటిల్‌తో రూపొందే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. వచ్చే వారం ప్రోమో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో ఢిల్లీలో షూటింగ్ ప్రారంభించబోతున్నారట.
ALSO READ :ఎకో ఫ్రెండ్లీ గణేశుడి ఆన్ లైన్ క్విజ్ పోటీలు
ఆ తర్వాత కొద్ది రోజులు లడఖ్‌లో షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ‘లూసిఫర్’ చిత్రం తెలుగులో చిరంజీవి హీరోగా ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే.