ఎవరైనా నా చేయి పట్టుకుంటారా?.. వైరల్ అవుతున్న మాళవిక పోస్ట్

ఎవరైనా నా చేయి పట్టుకుంటారా?.. వైరల్ అవుతున్న మాళవిక పోస్ట్

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వచ్చిన పేట(Peta) మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కేరళ బ్యూటీ మాళవిక మోహన్(Malavika Mohan). ఆ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తన తరువాతి సినిమా ఏకంగా విజయ్ తలపతి(Vijay Thalapathi)తో చేశారు. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj), విజయ్ కాంబోలో వచ్చిన మాస్టర్ సినిమాతో కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది మాళవిక.

ఆతరువాత ధనుష్ తో మారన్ చేసి.. మొదటి ప్లాప్ ను అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తో తంగలాన్ అనే సినిమా చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌లోని కేజీఎఫ్‌ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్నారు. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో.. విక్రమ్ గెటప్, ఇటీవల విదుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. తంగలాన్ హీరోయిన్ మాళవిక మోహన్ పెట్టిన ఎక్స్(ట్విట్టర్) పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. అదేంటంటే.. తంగలాన్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదల్లుపెట్టింది మాళవిక. ఇదే విషయాన్నీ తన ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేస్తూ..  సినిమా మేకింగ్ లో నాకు చాలా కష్టమైన పని డబ్బింగ్ చెప్పడం.  దయచేసి నేను చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి నా చేయి పట్టుకోగలరా? ప్లీజ్.. అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం మాళవిక చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.