ఎకానమీకి ముప్పుగా మారిన బెట్టింగ్​ వెబ్​సైట్లు, ప్లాట్​ఫారాలు

ఎకానమీకి ముప్పుగా మారిన బెట్టింగ్​ వెబ్​సైట్లు, ప్లాట్​ఫారాలు

న్యూఢిల్లీ : బెట్టింగ్​ వెబ్​సైట్లు/ప్లాట్​ఫారాలు మన ఎకానమీకి ముప్పుగా మారాయి. వీటి ద్వారా డబ్బు ఇండియా దాటి అక్రమంగా ఇతర దేశాలకు చేరుతోంది. ఇలాంటి సంస్థల్లో అత్యధికంగా చైనావే ఉన్నాయి. పేమెంట్​ గేట్​వేల ద్వారా ఇవి డబ్బును తమ సొంత దేశాలకు రప్పించుకుంటున్నాయి.  పేమెంట్ గేట్​వేలు తెలియకుండానో, ఉద్దేశపూర్వకంగానో ఇలా చేస్తున్నాయి. ఇవి మర్చంట్ల కేవైసీ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం చాలా సమస్యలకు దారి తీస్తోంది.  దీంతో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వీటి వెంటపడుతోంది. చైనీస్ లోన్ యాప్ కేసులో పేమెంట్​ గేట్‌‌వే కంపెనీలైన రేజర్‌‌పే, క్యాష్‌‌ఫ్రీ,  పేటీఎం కార్యాలయాలపై  పోయిన వారం ఈడీ దాడి చేసింది. అయినప్పటికీ కొన్ని వెబ్​సైట్లు తమ వ్యాపారాన్ని నిరాటంకంగా సాగిస్తున్నాయి. విదేశాల నుంచి పనిచేసే బెట్​వే డాట్​కామ్​, బెట్​65 కామ్​ వంటి గ్యాంబ్లింగ్,​  బెట్టింగ్ సైట్లు, భారతీయ కస్టమర్ల నుంచి యూపీఐతో సహా అన్ని రకాల భారతీయ పేమెంట్​ పద్ధతుల ద్వారా డబ్బు తీసుకుంటున్నాయి. గ్యాంబ్లింగ్​ వెబ్‌‌సైట్ల కస్టమర్ల కు నెట్‌‌బ్యాంకింగ్, ఐఎంపీఎస్,​  యూపీఐ వంటి  పేమెంట్​ పద్ధతులను ఉపయోగించడానికి అనుమతి ఉండదు.  ఇలాంటి యాప్స్​ మోసపూరితంగా మర్చంట్ ఐడెంటిఫికేషన్​కోడ్ (ఎంఐడీ) వాడి  భారతీయ బ్యాంకులను మోసగిస్తున్నాయి. కొన్ని పేమెంట్​-గేట్‌‌వే కంపెనీలు చైనీస్ లోన్ యాప్‌‌లతోపాటు గ్యాంబ్లింగ్​, బెట్టింగ్​ బిజినెస్​లకు సాయం చేస్తున్నాయని ఈడీ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం అనేక చైనీస్ లెండింగ్ యాప్‌‌లను నిషేధించినప్పటికీ  కొత్త క్లోన్‌‌లు పుట్టుకొస్తూనే ఉంటాయి.  ఈ యాప్‌‌లు లోన్లు ఇవ్వడానికి,  కస్టమర్ల నుంచి తిరిగి వసూలు చేయడానికి పేమెంట్​ గేట్‌‌వే అవసరం. లోన్​ కట్టనివారిని ఇవి తీవ్రంగా వేధిస్తున్నాయి. వారి బంధువులను, కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నాయి. ఫలితంగా చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు.

మోసం జరుగుతున్నది ఇలా..
ఇండియా నుంచి డబ్బు విదేశీ ఖాతాలకు వెళ్లాలంటే పేమెంట్​ గేట్‌‌‌‌వే తప్పనిసరి.  ఆసియా కప్ సమయంలో  ఫెయిర్​ప్లే, డాట్​క్లబ్ అనే ఆన్‌‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌‌ఫారమ్  ప్రకటనలు వెల్లువెత్తాయి. భారతదేశంలో ఆన్‌‌లైన్ బెట్టింగ్ చట్టవిరుద్ధం అయినా వీటి యాడ్స్​ కొనసాగుతున్నాయి. నో యువర్​ కస్టమర్ (కేవైసీ) రిజిస్ట్రేషన్‌‌ను పరిశ్రమ పరిభాషలో ఎంఐడీ అని కూడా పిలుస్తారు. ఎంఐడీలతో కొన్ని సంస్థలు డీకేసన్​@యెస్​బ్యాంక్​ డాట్​కామ్​అనే ఐడీ ద్వారా పేమెంట్లను తీసుకుంటున్నాయి. యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్​ఫర్​,  క్రిప్టో వంటి పద్ధతులను వాడుకుంటున్నాయి. ఫెయిర్​ప్లే డాట్​ క్లబ్​ వాడే మర్చంట్లలో డీకే సన్​ ఒకరు కావచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఈ కంపెనీల దగ్గర అప్రూవ్డ్​ ఎంఐడీల రిపోజిటరీ ఉంది. పేమెంట్లలో అంతరాయం కలగకుండా ఉండేందుకు  ప్రతి 15-20 నిమిషాలకు పేమెంట్​ గేట్‌‌వేలను, బ్యాంకులను మారుస్తూ ఉంటాయి. దీంతో బ్యాంకులు మోసాలను గుర్తించడం కష్టమవుతుంది.  చట్టబద్ధ లావాదేవీల కోసం వాడే ఎంఐడీలనే ఉపయోగించి మర్చంట్​ కేవైసీ అప్రూవల్​ సంపాదిస్తారు. బ్యాంకు/ఎన్​సీపీఐ ఎంఐడీని లేదా యూపీఐని ఐడీ బ్లాక్ చేసినా, ఇతర ఎంఐడీ, యూపీఐ ఐడీలను వాడుతారు. మరోసారి పట్టుకునే వరకు వ్యాపారం  నడుస్తూనే ఉంటుంది.  రూల్స్​ ప్రకారం మర్చంట్​ కేవైసీని వాడుతున్నారా అని తెలుసుకోవడానికే ప్రయత్నించే బ్యాంకుల ఐపీని కూడా యాప్‌‌లు అడ్డుకుంటాయి.